చిత్తూరు జిల్లా పీలేరు మండలం దేవలంవారి పల్లిలో రెడ్డప్పరాజు (50) అనే రైతు అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేతికొచ్చిన పంట చీడపురుగుల పాలై నాశనంమైందనే మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ముగ్గురు కుమార్తెల వివాహం కోసం రూ.6 లక్షల వరకూ ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
అప్పుల బాధతో పొలంలోనే అన్నదాత ఆత్మహత్య - data of farmers dieds in chittoor dst 2019-2020
ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా.. వారికి అవి అండగా నిలువలేకపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఓ అన్నదాత అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పెద్ద మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
farmer suicide in chittoor dst peleru due to financial problems
TAGGED:
latest news of chitoor dst