టమాటా సాగుకు చేసిన అప్పులు తీర్చలేక.. పురుగులు మందు తాగి ఓ రైతు ప్రాణాలు తీసుకున్నాడు. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం దిగువపల్లికి చెందిన రైతు తిమ్మయ్య.. మూడెకరాల పొలంలో కొడుకు ఈశ్వరయ్యతో కలిసి టమాటా సాగు చేశాడు.
రెండు బ్యాంకుల్లో రెండు లక్షలు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర మరో మూడు లక్షలు అప్పు చేశారు. పంట దిగుబడి వచ్చినా ధరలు అంతంతమాత్రంగానే ఉండటంపై ఆవేదనకు గురయ్యాడు. అప్పులు తీరవేమోనన్న అనుమానంతో పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.