చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో మృతి చెందిన ఎద్దుకు ఓ కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది. పడాకుల భాస్కర్ అనే రైతుకు వ్యవసాయంలో సహకరించే ఎద్దంటే ఎంతో ప్రేమ. అది పొలం పనులతో పాటు ఏ.రంగంపేటలో ఏడాదికోసారి నిర్వహించే పశువులపండగలో ఎన్నో బహుమతులు గెలుచుకుంది. అనారోగ్యం కారణంగా ఎద్దు మరణించడం వల్ల అన్నదాత ఆవేదన వ్యక్తం చేశాడు. 15 ఏళ్లుగా దానిపై ప్రేమను పెంచుకున్న ఆయన కుటుంబ సభ్యులు దానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఎద్దుకు అంత్యక్రియలు నిర్వహించిన రైతు కుటుంబం - చంద్రగిరి వార్తలు
రక్తసంబంధికులు చనిపోయినా కొందరు పంతాలతో లెక్క చేయరు. తెలిసిన వారు కాలం చేసినా కొందరు పట్టింపులకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఏళ్లుగా ప్రేమతో పెంచుకున్న ఎద్దు మరణించిందని ఓ రైతు కన్నీరు మున్నీరయ్యాడు. ఆయన కుటుంబసభ్యులంతా కలిసి దానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఎద్దుకు అంత్యక్రియలు