ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలం దున్నుతుండగా విద్యుదాఘాతం..రైతు మృతి - వేపేరిలో రైతు మృతి వార్తలు

పొలం దున్నుతున్న ఆ రైతు పొంచి ఉన్న మృత్యువును గమనించలేదు. చేనుకు వెళ్లిన అతను తిరిగిరాని లోకాలకు వెళతాడని కుటుంబసభ్యులు అనుకోలేదు. ట్రాక్టరుతో పొలం దున్నుతుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా వేపేరిలో జరిగింది.

farmer died due to current shock in veperi chittore district
పొలం దున్నుతూ విద్యుదాఘాతానికి గురై రైతు మృతి

By

Published : Sep 19, 2020, 8:31 PM IST

ట్రాక్టర్​తో పొలం దున్నుతూ విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం వేపేరి గ్రామానికి చెందిన ఖాసీం పొలం దున్నేందుకు ట్రాక్టర్​పై వెళ్లాడు. పొలం దున్నుతుండగా కిందకు జారిన కరెంట్ తీగలు ట్రాక్టర్​పై పడ్డాయి. వాటిని పక్కకు తీద్దామని చేత్తో పట్టుకోగానే విద్యుత్​ షాక్​ తగిలి..అక్కడికక్కడే ఖాసీం మృతి చెందాడు.

భర్త ఎంతసేపటికీ రాకపోవటంతో పొలానికి వెళ్లిన భార్యకు అపస్మారక స్థితిలో పడి ఉన్న ఖాసీం కనిపించాడు. వెంటనే స్థానికుల సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details