మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో నేడు తెదేపా నేతలు రైతు దగా దినోత్సవాన్ని నిర్వహించారు. రైతులను దగా చేస్తూ.. రైతు దినోత్సవం జరుపుకోవడం సిగ్గుచేటని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి ఆరోపించారు. రూ.వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన రైతు భరోసా కేంద్రాలు... వైకాపా నాయకుల విడిది కేంద్రాలయ్యాయని మండిపడ్డారు. రైతు భరోసా రూ.15,000 ఇస్తామని చెప్పి.. రూ. 7,500 కుదించి.. అది కూడా మూడు విడతల వారీగా ఇస్తూ రైతులను దగా చేస్తుందన్నారు.
శ్రీకాళహస్తీలో...