ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - Farmer commits suicide due to debt at punganur

చేసిన అప్పులు తీర్చలేక, పండిన పంటకు ధర రాక మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా పుంగునూరు మండలంలో ఈ ఘటన జరిగింది.

Farmer commits suicide
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

By

Published : May 19, 2020, 4:06 PM IST

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బైరే మంగళానికి చెందిన రైతు.. నాగరాజు అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు తనకున్న మూడు ఎకరాల్లో టమాటా సాగు చేశాడు. టమాటా దిగుబడి వచ్చే సమయంలో ధరలు లేకపోవడంతో తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. దీనికి తోడు కరోనా మహమ్మరి రైతు పై తీవ్ర ప్రభావం చూపింది. పండించిన పంటను బయటికి తీసుకెళ్లి విక్రయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇదీ చూడండి:అలా నడవకండి.. ఈ బస్సుల్లో వెళ్లండి!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details