చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం పద్మ సరస్సు గ్రామానికి చెందిన ముత్తుస్వామి అనే రైతు... తన పొలంలో మామిడి చెట్లను నాటారు. ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన వైకాపా నేత త్యాగరాజుకు, ముత్తుస్వామికి భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో తన పొలంలో మామిడి చెట్లు నరికి ఉండటం చూసి రైతు ఆవేదనకు గురయ్యాడు. త్యాగరాజే మామిడి చెట్లను నరికించాడని... కార్వేటినగరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు... సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితునికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
వైకాపా నేత దౌర్జన్యం...తోటలో మామిడి చెట్లు నరికివేత - చిత్తూరు జిల్లా వార్తలు
చిత్తూరు జిల్లా పద్మ సరస్సు గ్రామంలో స్థానిక వైకాపా నేత దౌర్జన్యానికి పాల్పడ్డాడు. పొలం కోసం ఓ రైతుతో ఘర్షణకు దిగడమే కాకుండా.. తోటలోని మామిడి చెట్లను నరికించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తోటలో మామిడి చెట్లు నరికివేత