ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్​ కేంద్రానికి ఫ్యాన్​లు అందజేసిన ఉపముఖ్యమంత్రి - chittoor district latest news

జిల్లాలోని పలు క్వారంటైన్​ కేంద్రాలకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఫ్యాన్​లు అందజేశారు. కొవిడ్​-19 నియంత్రణలో భాగంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని తెలిపారు.

fans disributed by deputy cm narayana swamy in chittoor district
క్వారంటైన్​లలో ఫ్యాన్​లు పంచిపెట్టిన మంత్రి నారాయణ స్వామి

By

Published : May 22, 2020, 11:41 PM IST

రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ –19 నియంత్రణకు చర్యలు వేగవంతం చేసిందని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. జిల్లాలోని పలు క్వారంటైన్ కేంద్రాలకు ఉపముఖ్యమంత్రి... ఫ్యాన్​లు అందజేశారు. కోవిడ్–19 నియంత్రణకు తమవంతు సాయంగా దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని పిలుపునిచ్చారు. క్వారంటైన్ సెంటర్లకు ఫ్యాన్లు అందించేందుకు ముందుకు వచ్చిన వివిధ సంఘాలు, సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. మద్యం నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని చెప్పారు. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తున్నామని.. ఇందుకోసం స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details