Family suicide : ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యాయత్నం - పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్యాయత్నం
14:09 September 23
ఆర్థిక సమస్యల కారణంగా తమిళనాడుకు చెందిన కుటుంబం చిత్తూరు జిల్లా విజయపురం సమీపంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లా విజయపురం మండలంలో తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన కుటుంబం పురుగుల మందు తాగి.. బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు వెంటాడుతున్న నేపథ్యంలో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడు వేలూరుకు చెందిన కరుణాకర్, భువనేశ్వరి దంపతులకు కుమార్తెలు మోహనప్రియా, దుర్గా ఉన్నారు. పెద్దకుమార్తెకు మతిస్థిమితం లేని కారణంగా వివాహం కావడం లేదన్న మనోవేదన, కుటుంబ యజమాని కరుణాకర్‌కు జీవనాధారంగా ఉన్న వాహనం కేరళా సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదం కేసులో చిక్కుపోవడం, ఇతర కారణాల వల్ల వీరు ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భువనేశ్వరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగిలిన ముగ్గురిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండీ..కొప్పర్రు ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ