ఐఆర్ఎస్ అధికారినంటూ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తిని... తితిదే నిఘా, భద్రతా విభాగం అధికారులు గుర్తించారు. ముంబై ఇంటెలిజెన్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నానని... తనతోపాటు మరో తొమ్మిది మందికి ప్రోటోకాల్ పరిధిలో శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేయాలని వెంకటరత్నారెడ్డి పేరుతో... తిరుమల జేఈవో కార్యాలయానికి సిపారసు లేఖ రాశారు. సిఫారసు లేఖతోపాటు ఐఆర్‌ఎస్ అధికారిగా తన నకిలి గుర్తింపు కార్డును జతపరిచారు. గుర్తింపు కార్డులో లోపాలను గుర్తించిన తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి... నిఘా అధికారులతో విచారణ చేయించగా... గుట్టు బయటపడింది. నిఘా అధికారులు పోలీసులకు విషయం తెలపగా... అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
ఐఆర్ఎస్ అధికారినంటూ వచ్చాడు... పోలీసులకు చిక్కాడు..! - తితిదేలో నకిలి ఐఆర్ఎస్ వార్తలు
ఐఆర్ఎస్ అధికారినంటూ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తిని తితిదే భద్రతా విభాగం అధికారులు గుర్తించారు. విషయం పోలీసులకు తెలపటంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
నకిలీ ఐఆర్ఎస్ను అరెస్టు చేసిన తిరుమల పోలీసులు