తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహామండలి సభ్యుడిగా నియమితులైన రమణ దీక్షితులు రేపటి నుంచి విధుల్లో చేరనున్నారు. వారం రోజుల్లో ప్రధాన అర్చకులుగా బాధ్యతలు చేపడతానని ప్రకటించారు. దశాబ్ద కాలం స్వామివారి సేవలో ఉన్న ఆయన... విధుల నుంచి తొలగించిన సమయంలో తితిదేపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అయితే తనలో ఆవేదనతోనే అలా చేశానని రమణదీక్షితులు చెప్పారు. తాను ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు చేపట్టినా... ప్రస్తుతం ఉన్న ప్రధాన అర్చకులపై ఎలాంటి చర్యలుండవని రమణదీక్షితులు అన్నారు.
'తితిదేపై నాటి ఆరోపణలన్నీ ఆవేదనతోనే చేశా..!' - ramana deekshitulu took oath
వారంలోగా శ్రీవారి ప్రధాన అర్చక బాధ్యతలు స్వీకరిస్తానని రమణ దీక్షితులు అన్నారు. ఆగమ సలహా మండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన... ఈటీవీ భారత్తో ముఖాముఖిలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
face 2 face interview with ramana deekshitulu