ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఘనంగా ఆబ్కారీ ఎస్‌ఐల పాసింగ్ అవుట్‌ పరేడ్

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కల్యాణి డ్యామ్ వద్ద పోలీసు శిక్షణ కళాశాలలో ఆబ్కారీ ఎస్సైల పాసింగ్ అవుట్‌పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న ఎస్‌ఐలు సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.

By

Published : Aug 4, 2021, 5:25 PM IST

Published : Aug 4, 2021, 5:25 PM IST

పాసింగ్ అవుట్‌ పరేడ్
పాసింగ్ అవుట్‌ పరేడ్

పోలీసు శిక్షణ కళాశాలలో ఆబ్కారీ ఎస్సైల కళాశాలలో పాసింగ్ అవుట్‌ పరేడ్

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పోలీస్ శిక్షణ కళాశాలలో ఎక్సైజ్ శాఖ ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ అశోక్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి అర్బన్ ఎస్పీ, స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టర్ రమేశ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఇక్కడ శిక్షణ పొందిన 45 మందిలో ఎంబీబీఎస్, ఇంజినీరింగ్, సీఏ, పీజీ చదువుకున్న 12 మంది ఉండడం ఎంతో అభినందనీయమని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి అన్నారు. కరోనా నేపథ్యంలోనూ కాలాన్ని కుదించి ప్రత్యేకమైన శిక్షణతో, కఠోరమైన శిక్షణను పూర్తి చేసుకోవడం సంతోషకరమని అభినందించారు. శిక్షణ పూర్తి చేసుకుని తమ ఉద్యోగం పట్ల బాధ్యతగా వ్యవహరించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి వెళుతున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శిక్షణ కాలంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు మెమొంటోలు అందించారు. మెమెంటోలు స్వీకరిస్తున్న సమయంలో తమ బంధువులు ఆ మధుర జ్ఞాపకాన్ని చరవాణుల్లో చిత్రీకరిస్తూ ఉబ్బితబ్బిబ్బయ్యారు.

కరోనా విపత్తు కాలంలో ప్రజలకు ముందు నిలిచేది పోలీసులేనని.. ప్రజా ప్రతినిధుల దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు రక్షణ కల్పించేది పోలీసులేనని ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి అన్నారు. శిక్షణ పొందిన అందరూ సమాజ రక్షణతో పాటు సమాజ అభివృద్ధికి తోడ్పడాలని అభిప్రాయపడ్డారు. ఇండోర్ స్టేడియం నిర్మాణానికి తుడా నిధులు సమకూరుస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details