తిరుపతి రుయా ఆస్పతిలో జరిగిన విషాద ఘటనపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్.. జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖ రాశాడు. ఈ నెల పదవ తేదీన ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవటంతో 30మంది ప్రాణాలు కోల్పోయారని… కేవలం అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన మానవ హక్కులను కాలరాసిందని ఆక్షేపించారు. ఎన్హెచ్ఆర్సీ.. స్వయంగా విచారణ జరిపి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు.
జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖ రాసిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
తిరుపతి రుయా ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక ముప్పై మంది మరణించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ లేఖ రాశారు. దీనిపై విచారణ జరిపి.. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఎన్హెచ్ఆర్సీని కోరారు.
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్