నిరర్ధక ఆస్తుల పేరిట తితిదే భూములను వేలం వేయటం.. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి, తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్ అన్నారు. తిరుపతిలో మాట్లాడుతూ.. తితిదే ఆస్తులు... తిరుమల శ్రీవారి జోలికి రావద్దని కోరారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లలో ఉన్న వేళ... ప్రభుత్వం తితిదే ఆస్తులను విక్రయించాలనుకోవడం దారుణమన్నారు. సంక్షేమ పథకాల కోసం దేవాలయాల భూములను విక్రయించే హక్కు ప్రభుత్వానికి లేదన్న ఆయన... సొంత మనుషులకు లబ్ధి చేకూర్చేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.