EX Sarpanch Suicide Attempt In Chittoor : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల సచివాలయంలో తెదేపా నాయకుడు, మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేశారు. చెంగుబళ్ల పంచాయతీ మాజీ సర్పంచ్ గోపాల్.. తన పొలానికి దారి సమస్య పరిష్కారం కోరుతూ స్పందన కార్యక్రమంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మండల రెవెన్యూ అధికారులకు పలుమార్లు విన్నవించాడు. వినతులు స్వీకరించిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించినా.. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. వారం రోజుల కిందట రెవెన్యూ డివిజన్ అధికారికి విన్నవించిన గోపాల్.. ఆర్డీవో కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. ఈరోజు ఉదయం క్షేత్ర పరిశీలన చేపట్టిన అధికారులు సమస్యను మాత్రం పరిష్కరించలేదు. దీంతో అధికారుల తీరుపై ఆవేదన చెందిన గోపాల్.. మండల సచివాలయంలో తాడుతో ఉరి వేసుకునే ప్రయత్నం చేయగా అధికారులు అడ్డుకున్నారు.
సచివాలయంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న అధికారులు - crime news in ap
EX Sarpanch Suicide Attempt : పొలానికి దారి సమస్య పరిష్కారంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెదేపా నేత, మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగింది.
EX Sarpanch Suicide Attempt
TAGGED:
EX Sarpanch Suicide Attempt