ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీహార్ జైలుకు వెళ్లివచ్చిన వారు తితిదే బోర్డులో సభ్యులా..? చింతామోహన్ - చింతామోహన్

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేత చింతామోహన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వక్తం చేశారు. ప్రవిత్రమైన తితిదే ధర్మకర్తల మండలిలోకి తీహార్ జైలుకు వెళ్లివచ్చిన వారిని తీసుకోవడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పరిపాలన సాగుతోందన్నారు.

ex mp chinta mohan
ex mp chinta mohan

By

Published : Sep 18, 2021, 5:11 PM IST

తీహార్ జైలుకు వెళ్ళివచ్చిన వారిని తితిదే ధర్మకర్తల మండలిలోకి తీసుకోవడం విడ్డూరంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి చితామోహన్ అన్నారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన.. పవిత్రమైన దేవస్థానంలో జైలుకు వెళ్లివచ్చిన వారిని నియమించడం అంటే ధర్మకర్తల మండలి అన్న పదానికి అర్ధం మారిందన్నారు. రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పరిపాలన సాగుతోందన్నారు.

డ్రగ్స్, గంజాయి రవాణా నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని చింతామోహన్ మండిపడ్డారు. పార్టీలు పెట్టడం ద్వారా రాజకీయాలను వ్యాపారంగా మార్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏడు సంవత్సరాల్లో రామమందిరం విషయంలో తప్ప భాజపా సాధించిందేంటని ఆయన ప్రశ్నించారు. రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి బాగాలేదన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడిని ఖండిస్తున్నానని.. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష పార్టీలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details