ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా తీరుపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దీక్ష - ex mla suggunamma strict at chittoor dst

కరోనా లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలపై వైకాపా ప్రభుత్వం అదనపు భారం మోపుతోందని తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ ఆరోపించారు. తన స్వగృహంలో వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు.

ex mla sugunamma doing hunger strick against ycp govt  at chittoor dst tirupati
ex mla sugunamma doing hunger strick against ycp govt at chittoor dst tirupati

By

Published : May 16, 2020, 8:10 PM IST

వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నిరాహార దీక్ష చేపట్టారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి లాక్​డౌన్​లోనూ మద్యం దుకాణాలు తెరవడంతో పాటు ధరలను పెంచి పేద ప్రజలకు దోచుకుంటున్నారని విమర్శించారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కరవై... తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో విద్యుత్ ఛార్జీల ధరల పెంచారని ఆరోపించారు. మధ్యతరగతి ప్రజలపై భారం పెంచకుండా వెంటనే విద్యుత్ ఛార్జీల ధరలు తగ్గించాలని సుగుణమ్మ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details