సమష్టి కృషితో తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని తేదేపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. విజయ సాధనకై నేతలకు దిశానిర్దేశం చేశారు. వైకాపా ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధిస్తామన్నారు. మార్చి నెలాఖరుకు వచ్చినప్పటికీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రికి కక్షసాధింపు తప్ప ప్రజా సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు.
'సమష్టి కృషితో తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధిస్తాం' - తిరుపతిలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కార్యకర్తలతో తేదేపా నేతలు సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప.. విజయసాధన కోసం దిశానిర్ధేశం చేశారు.
తేదేపా కార్యకర్తలతో మాజీ మంత్రి చినరాజప్ప సమావేశం