ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి: అమర్​నాథ్​ రెడ్డి - యాదమరిలో తెదేపా అభ్యర్థులపై దాడిని ఖండించిన మాజీ మంత్రి అమర్​నాథ్ రెడ్డి

చిత్తూరు జిల్లా యాదమరిలో తెదేపా బలపరిచిన అభ్యర్థులపై జరిగిన దాడిని.. మాజీ మంత్రి అమర్​నాథ్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసే వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చేస్తున్న పనులకు వైకాపా ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలంటూ విమర్శించారు.

ex minister condemned yadamari attack
యాదమరిలో తెదేపా మద్దతుదారులపై దాడిని చిత్తూరులో ఖండించిం మాజీ మంత్రి అమర్​నాథ్​ రెడ్డి

By

Published : Jan 31, 2021, 7:46 PM IST

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే.. వైకాపా ప్రభుత్వం వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఉంటే బాగుండేదని మాజీ మంత్రి అమర్​నాథ్ రెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

యాదమరి మండలం నామినేషన్ ప్రక్రియలో.. తెదేపా బలపరిచిన అభ్యర్థులపై దాడులకు పాల్పడిన ఘటనను మాజీ మంత్రి ఖండించారు. నామినేషన్ వేస్తున్న వారిపై ఏదో రకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చేస్తున్న పనులపై వైకాపా ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. నేతలంతా కలిసి బృందంగా యాదమరికి వెళ్లి.. అక్కడ జరిగిన పరిస్థితులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details