వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై 50వేల కోట్ల రూపాయల భారం మోపిందని… మాజీమంత్రి అమర్నాథ్రెడ్డి విమర్శించారు. కరోనా సమయంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్ధికంగా చితికిపోయారని, ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కరెంట్ చార్జీలతో భారం మోపుతోందని మండిపడ్డారు. పాదయాత్రలో కరెంట్ చార్జీలు బాదుడే… బాదుడు అంటూ అధికార పార్టీని విమర్శించిన జగన్… ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ప్రజల నుంచి మూడింతలు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మూడు నెలల కరెంట్ బిల్లు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమండ్ చేశారు. ఒక ఫ్యాన్, లైట్ మాత్రమే ఉన్న ఇంటికి 41 వేల రూపాయల కరెంట్ బిల్లు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బ్రాండ్ లేని మద్యం తీసుకువచ్చి ప్రజాఆరోగ్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అడుకుంటున్నాడని ధ్వజమెత్తారు.
3 నెలల కరెంట్ బిల్లులు రద్దు చేయాలి: అమర్నాథ్ రెడ్డి - amarnath reddy latest news
ఈ మూడు నెలల కరెంట్ బిల్లు రద్దు చేయాలని మాజీమంత్రి అమర్నాథ్రెడ్డి ప్రభుత్వాన్ని డిమండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై 50వేల కోట్ల రూపాయల భారం మోపిందని ఆరోపించారు.
అమర్నాథ్ రెడ్డి