ఈ నెల 10వ తేదీన తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన సమస్యల కారణంగా పదకొండు మంది మృతి చెందారు. వీరిలో చిత్తూరు నగరానికి చెందిన భువనేశ్వర్ బాబు ఒకరు. మృతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. స్థానిక కలెక్టరేట్లో భువనేశ్వర్ బాబు తండ్రికి ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి పది లక్షల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ పాల్గొన్నారు.
రుయా బాధిత కుటుంబానికి పరిహారం అందజేత - exgresia given to victims family in ruya incident news
తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. చిత్తూరుకు చెందిన భువనేశ్వర్ బాబు కుటుంబానికి ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి రూ.10 లక్షల చెక్కును అందించారు.
![రుయా బాధిత కుటుంబానికి పరిహారం అందజేత ex gratia](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:49:54:1620922794-ap-tpt-17-13-minister-exgresia-giving-av-ap10008-13052021213416-1305f-1620921856-993.jpg)
పరిహారం చెక్కును అందిస్తున్న ఉపముఖ్యమంత్రి