తిరుపతి ఉపఎన్నికలో వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. పోలీసులు వారికి సహకరిస్తున్నారని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్ధి చింతా మోహన్ ఆరోపించారు. ఉప ఎన్నికల పోలింగ్‌లో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు వైకాపా నేతలు ప్రణాళికలు రూపొందించుకున్నారని ఆయన ఆరోపించారు.
'ఉప ఎన్నిక పోలింగ్‌లో రిగ్గింగ్‌కు వైకాపా ప్రణాళిక' - ఈరోజు కాంగ్రెస్ అభ్యర్ధి చింతా మోహన్ తాజా వ్యాఖ్యలు
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్ధి చింతా మోహన్.. అధికార పార్టీ తీరుపై విమర్శలు గుప్పించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా నేతలు రిగ్గింగ్‌కు పాల్పడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని తిరుపతిలో ఆయన డిమాండ్ చేశారు.
!['ఉప ఎన్నిక పోలింగ్‌లో రిగ్గింగ్‌కు వైకాపా ప్రణాళిక' ex central minister chitha mohan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11424205-308-11424205-1618565989841.jpg)
కాంగ్రెస్ అభ్యర్ధి చింతా మోహన్
సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య దొంగ ఓట్లు వేయనున్నారని అన్నారు. వాటిపై చర్యలు తీసుకొవాల్సిన పోలీసులు.. వారికి సహకరించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు తిరుపతిలో మకాం వేశారని.. కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి...