రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. సంక్రాంతి నాటికి రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తారని..జోస్యం చెప్పారు. పేదలకిచ్చే బియ్యాన్ని ప్రజాప్రతినిధులు 50 శాతం పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. కుర్చీ పోతుందన్న దిగులుతో సీఎం జగన్ బయటకు రావటం లేదన్నారు. సినిమా టికెట్లు అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమా ? అని ప్రశ్నించారు.
దేశం, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం అవసరమని..కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమవుతుందన్నారు. దీపావళిలోపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు ప్రతినిధిగా నియమితులవుతారని తెలిపారు.