ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హాథ్రస్ ఘటనలో నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రభుత్వం విఫలం' - తిరుపతిలో మాజీ కేంద్ర మంత్రి చింతా నిరసన

దళితుల పట్ల జరుగుతున్న దాడులపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ స్పందించారు. కొంతకాలంగా ఈ తరహా ఘటనలు అధికమయ్యాయన్నారు. హాథ్రస్ ఉదంతంలో నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Ex minister chinta protest
మాజీ కేంద్ర మంత్రి చింతా నిరసన

By

Published : Oct 2, 2020, 12:51 PM IST

కేంద్ర మాజీ మంత్రి చింతా నిరసన

ఉత్తరప్రదేశ్​లో దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా హత్య చేసిన ఘటనను కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చింతా మోహన్ ఖండించారు. తిరుపతిలోని తన నివాసంలో ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

నిందితులను అరెస్ట్ చేయడంలో విఫలమైన యూపీ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని చింతా కోరారు. కొంత కాలంగా దళితులపై దాడులు తీవ్రమయ్యాయని ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి పదవికి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:చలో మదనపల్లె: తిరుపతిలో ఉద్రిక్తత.. ఎస్సీ సంఘాల నేతల అరెస్టు

ABOUT THE AUTHOR

...view details