చంద్రబాబు నియోజకవర్గంలోనూ ఈవీఎంల మొరాయింపు - EVMS
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం నియోజవర్గంలోనూ ఈవీఎంలు సతాయిస్తున్నాయి. ఓటు వేయడానికి వచ్చిన ప్రజలు పడిగాపులు కాస్తున్నారు.

పనిచేయని ఈవీఎం
మొరాయిస్తున్న ఈవీఎమ్ లు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయింపుతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. శాంతిపురం మండలంలోని పెద్దూరు పోలింగ్ కేంద్రం పరిధిలో 847 మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు ఈవీఎంలు పని చేయలేదు. వందలాది మంది ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద నిరీక్షిస్తున్నారు. కుప్పం, పాలెం గుడిపల్లి, శెట్టిపల్లి, శాంతిపురం మండలాల్లోని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.