- రేపటి నుంచి ఎటువంటి సర్వీసులు ప్రారంభం కానున్నాయి?
జూన్ 1 నుంచి తిరుపతి నుంచి నిజామాబాద్‌కు వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించనున్నాం. గతంలో ఉన్న టైమింగ్ ఆధారంగానే ట్రైన్‌ను నడపనున్నాం. దీనికోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంది. రైల్వే స్టేషన్లో కౌంటర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఈ రైలులో ప్రయాణించాలంటే కచ్చితంగా రిజర్వేషన్ ఉంటేనే అనుమతిస్తాము. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నా అనుమతించం. ప్రయాణికులను రైళ్లల్లోకి అనుమతించే ముందు శానిటైజ్, థర్మల్ స్క్రీనింగ్ చేస్తాము. ప్రయాణికుల్లో ఎవరికైనా అధిక ఉష్ణోగ్రత ఉంటే వారిని కంపార్టుమెంటులోకి అనుమతించం. ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తాం. రైల్వే స్టేషన్లో ప్యాకెడ్ ఫుడ్ దొరకదు. ప్రయాణికులు ఎవరి ఆహారం వారే తెచ్చుకోవాలి.
- రైల్వే ఉద్యోగులకు ఉన్న నిబంధనలు ఏమిటి?
ప్రతి ఒక్క ఉద్యోగికి మాస్క్ తప్పనిసరి. తరచుగా శానిటైజ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఉద్యోగులందరికీ మాస్కులు, గ్లౌజులు అందజేశాం.
- స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్లలో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లల్లో ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు?