చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ భరత్‌గుప్తా తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లాలో 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్న ఆయన.. శ్రీకాళహస్తిలో ఎక్కువగా 43 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఓపీ సేవలను పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కరోనా మినహా మిగిలిన కేసులకు అవసరమైతే రుయా తరఫున ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనాపై ఆందోళన వద్దంటున్న కలెక్టర్ భరత్‌గుప్తాతో మా ప్రతినిధి ముఖాముఖి..!
'కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం' - etv bharat face to face latest news
చిత్తూరు జిల్లాలో కరోనా కేసులపై అప్రమత్తంగా ఉన్నట్లు కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటి వరకూ 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్న ఆయన.. బాధితులను క్వారంటైన్‌కు తరలించినట్లు చెప్పారు. రెడ్ జోన్లలో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాతో 'ఈటీవీ భారత్' ముఖాముఖి