తిరుమల తిరుపతి దేవస్థానంలో కారుణ్యం నియామకాలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దేవస్థానంలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి అనారోగ్యం, కరోనా, ఇతర సమస్యలతో అనేక మంది ఉద్యోగులు మరణించారని.. అయితే వారి కుటుంబాలు రెండేళ్లుగా కారుణ్య నియామకాల కొరకు ఎదురు చూస్తున్నట్లు సంఘాలు పేర్కొన్నాయి. సుమారు 130 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని .. వాళ్లను వెంటనే నియామించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు మల్లారపు నాగార్జున, పలువురు సభ్యులు కోరారు.
తితిదేలో కారుణ్య నియామకాలు చేపట్టాలి: ఉద్యోగ సంఘాల జేఏసీ - కారుణ్య నియామకాలు చేపట్టాలని తితిదే ఉద్యోగ సంఘాలు
తితిదేలో కారుణ్యం నియామకాలు చేపట్టాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు మల్లారపు నాగార్జున కోరారు. సుదీర్ఘకాలం విధులు నిర్వహించి మృతిచెందిన వారి కుటుంబాలు నియామకాల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో కారుణ్య నియామకాలు