ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పలమనేరులో ఏనుగుల సంచారం.. ఒకేసారి రోడ్డు దాటిన 38 గజరాజులు - పలమనేరులో ఏనుగుల సంచారంవార్తలు

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండపేట కోడూరు వద్ద ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తోంది. గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు... రోడ్డు దాటుతుండగా స్థానికులు ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు.

పలమనేరులో ఏనుగుల సంచారం.. ఒకేసారి రోడ్డు దాటిన 38 గజరాజులు
పలమనేరులో ఏనుగుల సంచారం.. ఒకేసారి రోడ్డు దాటిన 38 గజరాజులు

By

Published : Jun 2, 2021, 11:52 AM IST

Updated : Jun 2, 2021, 3:16 PM IST

పలమనేరులో ఏనుగుల సంచారం.. ఒకేసారి రోడ్డు దాటిన 38 గజరాజులు

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండపేట కోడూరు వద్ద ఏనుగుల గుంపు స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. సుమారు 38 ఏనుగులు ఉన్న ఆ భారీ గుంపు.. కొన్ని రోజులుగా గ్రామ సమీపంలో తిష్ట వేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

అయితే.. ఇవాళ గజరాజులు రోడ్డు దాటుతుండగా చూసి.. స్థానికులు వీడియో తీశారు. అటవీశాఖకు సమాచారమిచ్చారు. గ్రామానికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి ఏనుగుల గుంపును తరలించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

Last Updated : Jun 2, 2021, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details