చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలో ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి. నెల్లిపట్ల అటవీప్రాంత పరిసరాల్లోని పొలాల్లో తిరుగుతున్న 14 ఏనుగులు.. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఒక్కసారిగా గ్రామాలపైకి రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఏనుగులను దారి మళ్లించాలని స్థానికులు.. అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.
పలమనేరులో గజరాజుల బీభత్సం.. అన్నదాతలకు తీవ్ర నష్టం - చిత్తూరులో పలమనేరులో గజరాజుల బీభత్సం
చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తూ.. రైతులకు నష్టాలను చేకూరుస్తున్నాయి. ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

పలమనేరులో గజరాజుల బీభత్సం