ELEPHANTS IN CHITTOOR : చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముసలిమడుగు వద్ద ఏనుగుల హల్‌చల్ చేశాయి. రహదారులపైకి వచ్చి అరగంటపాటు అలజడి సృష్టించాయి. రోడ్డుకు అడ్డుగా ఉండటంతో రాకపోకలకు కొంత సమయం అంతరాయం కలిగింది. గజరాజులు వెళ్లే వరకు వాహనదారులు వేచి చూడాల్సి వచ్చింది. స్థానికులు భయంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తమ గ్రామాల వైపు ఏనుగుల గుంపు రాకుండా చర్యలు చేపట్టాలని అటవీ శాఖ అధికారులను కోరారు. ఉదయాన్నే మంచు కురుస్తున్న సమయంలో గజరాజులు రోడ్లపైకి రావటంతో కొందరు ఈ దృశ్యాలను తమ చరవాణిల్లో బంధించారు.
మంచు కురిసే వేళలో.. రోడ్లపై గజరాజుల హల్‌చల్ - ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల హల్‌చల్
ELEPHANTS HULCHAL IN CHITTOOR : చిత్తూరులో గజరాజులు హల్‌చల్ చేశాయి. మంచు కురుస్తున్న సమయంలో ఏనుగులు రోడ్లపైకి వచ్చి అరగంట పాటు అలజడి సృష్టించాయి.
ELEPHANTS IN CHITTOOR