రెండు రోజుల క్రితం శ్రీరంగరాజపురం మండల శివారులో ఉన్న ఏనుగులు గుంపు.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలోకి ప్రవేశించడంతో రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే డీఆర్ఎన్ కండ్రిగ, చిన్న నక్కలాంపల్లి ఎస్సీ కాలనీ పరిసరాల్లో.. చెరకు, మామిడి తోటలపై దాడులు చేశాయి. పగలంతా అటవీ ప్రాంతంలో తిష్టవేసి.. సాయంత్రం డీఆర్ఎన్ కండ్రిగ సమీప చెరువు వద్దకు గజరాజులు చేరుకున్నాయి. ఈ విషయమై అటవీ శాఖ అధికారులకు స్థానిక రైతులు సమాచారం అందించారు.
పంటలు నాశనం చేస్తున్న ఏనుగులు.. అడవిలోకి తరుముతున్న అధికారులు - group of elephants damaging crops in vedurukuppam and srirangarajapuram mandals
ఎన్నడూ ఊహించని విధంగా ఏనుగులు చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో.. పంట పొలాలను నాశనం చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని డీఆర్ఎన్ కండ్రిగ, చిన్న నక్కలాంపల్లి ఎస్సీ కాలనీ పరిసరాల్లో.. చెరకు, మామిడి తోటలపై ఏనుగులు దాడి చేసి పంట నష్టం కలిగించాయని వాపోయారు.
![పంటలు నాశనం చేస్తున్న ఏనుగులు.. అడవిలోకి తరుముతున్న అధికారులు elephants damaging crops in vedurukuppam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10158755-655-10158755-1610039852251.jpg)
వెదురుకుప్పంలో పంటలు నాశనం చేస్తున్న ఏనుగులు
వెదురుకుప్పంలో పంటలు నాశనం చేస్తున్న ఏనుగులు
కార్వేటినగరం రేంజ్ అటవీశాఖ అధికారి శివన్న.. తన సిబ్బంది, స్థానిక రైతుల సహకారంతో ఏనుగులను అటవీ ప్రాంతం వైపు తరుముతున్నారు. అధికారుల సూచనల మేరకు పొలాల వద్ద రైతులు.. భారీ ఎత్తున బాణసంచా పేల్చి గజరాజులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదీ చదవండి:కలకలం రేపుతున్నకోళ్ల మృతి..