చిత్తూరు జిల్లాలో ఏనుగులు మరోసారి విరుచుకుపడ్డాయి. వి.కోట మండలంలో పంటలను నాశనం చేశాయి. ఈ కారణంగా వెంకటేపల్లె, కుమ్మరమడుగు, దానమయ్యగారిపల్లె, పచ్చారుమేకలపల్లె గ్రామాల్లోని వందల ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. గుంపుగా వచ్చిన ఏనుగులు రాత్రంతా పంటపొలాలపై పడి నాశనం చేశాయని రైతులు వాపోయారు.
ఏనుగుల సంచారం.. అరటి, బీన్స్ పంటలు నాశనం - elephants roming in V.Kota zone
చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పొలాల్లో సంచరించి.. కోతకు వచ్చిన పంటలను నాశనం చేశాయని రైతులు ఆవేదన చెందారు. అన్నదాతలు బాణసంచా పేల్చుతూ, డప్పులు వాయిస్తూ.. గజరాజులను నిలువరించేందుకు యత్నించారు.
![ఏనుగుల సంచారం.. అరటి, బీన్స్ పంటలు నాశనం Elephants destroying crop fields](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12422483-688-12422483-1625984461871.jpg)
పంట పొలాలను నాశనం చేసిన ఏనుగులు
పంట పొలాలను నాశనం చేసిన ఏనుగులు
కోళ్లఫారాలను కూలదోయటంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. కోతకు వచ్చిన అరటి, బీన్స్ పంటలను ఏనుగులు నాశనం చేశాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రంతా పంట పొలాలపై పడిన ఏనుగుల గుంపు నుంచి.. వేరుపడిన ఓ ఏనుగు ఉదయం పొలాల్లో ఉండటంతో దాన్ని తరిమేందుకు రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరారు. బాణసంచా పేల్చుతూ, డప్పులు వాయిస్తూ ఏనుగును అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించారు.
ఇదీ చదవండీ..Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..రాగల మూడ్రోజులు వర్షాలు