చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అటవీప్రాంత సమీపంలో పంట పొలాలపై ఏనుగులు దాడి చేస్తున్నాయి. మండల పరిధిలోని యల్లంపల్లి, భీమవరం, మూలపల్లి, కూచివారిపల్లి ప్రాంతాల్లో మామిడి, కొబ్బరి చెట్లను విరిచేశాయి. వరి పైరును మొత్తం తొక్కేశాయి. కూరగాయలు, దోస తోటలవైపు రావడాన్ని గమనించిన రైతులు.. డప్పులు, టపాకాయలతో బెదరగొట్టి తరిమేశారు. నిన్న అర్ధరాత్రి యల్లంపల్లిలో పంట పొలాలను పాడుచేసి, పొలాలకు వేసిన కంచెను కూడా నాశనం చేశాయి. గజరాజుల సంచారంతో రైతులు పొలాల వైపు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ, రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
పంట పొలాలను నాశనం చేస్తున్న ఏనుగులు... చర్యలు తీసుకోవాలంటున్న రైతులు - chandragiri latest news
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అటవీ ప్రాంత సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. మండల పరిధిలోని గ్రామాల్లో తిరుగుతూ పంట పొలాలు, తోటలను పాడు చేస్తున్నాయి. అటవీ శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఏనుగుల దాడిలో విరిగిన చెట్లు
ఏనుగులు పంట పొలాల్లో తిరగటం గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అవి అడవిలోనే ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు. రైతులు జాగ్రత్తలు పాటిస్తూ… సిబ్బందికి సహకరించాలని కోరారు. గజరాజుల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి:తిరుపతి: రుయాలో మరో 2 బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధరణ