ELEPHANTS ATTACK ON FARMER: చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడుల బీభత్సం కొనసాగుతోంది. తాజాగా జరిగిన దాడిలో గణేష్పురానికి చెందిన రామలింగం అనే రైతు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యులు తెలిపారు. గుంపుగా ఏనుగులు వచ్చి దాడులు చేయడంతో చిత్తూరు జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కొనసాగుతోన్న ఏనుగుల దాడి.. మరో రైతుకు గాయాలు - కారుపై ఏనుగు దాడి
ELEPHANTS ATTACK : చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడి కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఏనుగుల దాడిలో కారు నుజ్జునుజ్జు అయిన ఘటన మరువక ముందే.. తాజాగా మరో రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది.
ELEPHANT ATTACK ON FARMER
రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారుపై ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి చిత్తూరుకు కారులో వెళ్తున్న కుటుంబం భయభ్రాంతులకు గురై అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మరో రైతుపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
ఇవీ చదవండి:
Last Updated : Sep 19, 2022, 3:22 PM IST