ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాపం ఏనుగు.. అలా దారి తప్పింది.. ఇలా మృత్యువాత పడింది! - ఏపీలో ఏనుగుల మృతుల

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కోతిగుట్ట శివారులో విద్యుదాఘాతంతో ఏనుగు మరణించింది. విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో ఏనుగుపై విద్యుత్‌ తీగలు పడ్డాయి.

Elephant died with electric shock at Chittoor district palamaneru
విద్యుదాఘాతంతో ఏనుగు మృతి..

By

Published : Jun 11, 2021, 9:26 AM IST

చిత్తూరు జిల్లా పలమనేరు గ్రామీణ మండలం కోతిగుట్ట శివారులో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. మండల పరిధిలోని కోతిగుట్ట గ్రామ శివారులో.. ఏనుగుల గుంపు నుంచి ఓ గజరాజు విడిపోగా.. పొలంలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఆ ఏనుగు ఒంటిని రాసుకునేందుకు ప్రయత్నించింది.

ఈ క్రమంలో... ఏనుగు బలానికి విద్యుత్ స్తంభం విరిగిపోగా... కరెంటు తీగలన్నీ మీద పడ్డాయి. ఆ ఏనుగు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ABOUT THE AUTHOR

...view details