Elephant in Chittoor District: చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో జాతీయ రహదారిని దాటేందుకు ఓ ఏనుగు ప్రయత్నించింది. అది రోడ్డు దాటడాన్ని స్థానికులు, ప్రయాణికులు గమనించారు. రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన ఆ ఏనుగును అడవిలోకి మళ్లించడానికి స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అటవీ శాఖ అధికారులు సైతం టపాకాయలు పేల్చినా.. అడవిలోకి వెళ్లకుండా జాతీయ రహదారిపై కొన్ని గంటల పాటు బీభత్సం సృష్టించింది. గజరాజును తరమడానికి అటవీ అధికారులు, ప్రజలు భారీ శబ్దాలు చేయటంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. కొన్ని గంటల పాటు ముప్పు తిప్పలు పడ్డ అధికారులు, ప్రజలు ఏనుగును ఆటవిలోకి మళ్లించారు. అర్ధరాత్రి ఈ ఘటనతో స్థానికులు మళ్లీ తిరిగి వస్తుందేమోననే ఆందోళనలో ఉండిపోయారు.
చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి ఏనుగు బీభత్సం - రహదారిపై ఏనుగు
Elephant: చిత్తూరు జిల్లాలో ఓ ఏనుగు రాహదారిని దాటేందుకు ప్రయత్నించింది. అది సరిగా రోడ్డు దాటి అడవిలోకి వెళ్లినా బాగుడేంది. కానీ రోడ్డు దాటకుండా అక్కడే ఉండి స్థానికులకు చుక్కలు చూపించింది. ఇంతకీ ఏమైందంటే..
ఏనుగు