చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులను ఎంపీడీవో రాధమ్మ కోరారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో స్టేజ్-2 రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
చంద్రగిరి మండలంలో 121 పోలింగ్ కేంద్రాల్లో చివరిదశ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. సమస్యాత్మకమైన గ్రామపంచాయతీల ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎంపీడీవో అన్నారు. మొత్తం 353 మంది స్టేజ్ -2 అధికారులు చివరి దశ పోలింగ్ లో పాల్గొంటారని తెలిపారు.