ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో ముగిసిన తొలిదశ నామినేషన్ల ఘట్టం

చిత్తూరు జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఆదివారంతో ముగిసింది.

చిత్తూరు జిల్లాలో ముగిసిన తొలిదశ నామినేషన్ల ఘట్టం
చిత్తూరు జిల్లాలో ముగిసిన తొలిదశ నామినేషన్ల ఘట్టం

By

Published : Feb 1, 2021, 11:54 AM IST

చిత్తూరు జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఆదివారంతో ముగిసింది. పలు పంచాయతీల్లో సర్పంచి స్థానానికి ఒకరే నామినేషన్‌ వేశారు. మరికొన్ని ప్రాంతాల్లో డమ్మీ అభ్యర్థిగా తమ కుటుంబ సభ్యులతో నామినేషన్‌ వేయించారు. నామపత్రాల పరిశీలన అనంతరం డమ్మీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోనున్నారు.

జిల్లాలో ఆదివారం రాత్రి వరకు వెలువడిన సమాచారం మేరకు... నిండ్ర మండలం కీలంబాకానికి లైలా, మేళంబాకానికి బాలకృష్ణమరాజు, కె.ఆర్‌.పాళ్యేనికి గౌరి, గుడిపాలలో పానాటూరికి పల్లవి, ఐరాలలో పుత్రమద్దికి సుశీల, ఎం.పైపల్లెకు జమున, బొమ్మసముద్రానికి వి.రఘు, కార్వేటినగరంలో డి.ఎం.పురానికి ఐ.తులసికుమారి, పూతలపట్టులో చిటిపిరాళ్లకు జయచంద్రారెడ్డి, పెనుమూరులో గుంటిపల్లెకు కె.మునిరత్నంరెడ్డి, నారాయణవనంలో భీముని చెరువుకి మురుగేశన్‌, బొప్పరాజుపాళ్యేనికి మునికుమారి, కసింమిట్టకి శశికళ, తిరువట్యానికి నాగూరు, బంగారుపాళ్యంలో మొగిలి వెంకటగిరికి దీప్తిరెడ్డి, తిమ్మోజీపల్లెకు రేఖ, వెదురుకుప్పంలో గొడుగుచింత నుంచి నక్కా బాబు, విజయపురంలో మాధవరం నుంచి మమత, యాదమరిలో మోర్ధానపల్లెకు కె.మీనా, తవణంపల్లెలో ఈచినేరికి కె.ఉమామహేశ్వరరెడ్డి మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. వీరి అభ్యర్థిత్వాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details