ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి లోక్​సభ నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్: కలెక్టర్ - ాతామూగదల లాైే

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారం ముగిసిన కారణంగా... అక్కడ 144 సెక్షన్​ అమలు చేసినట్లు కలెక్టర్​ హరినారాయణన్​ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. నియోజక వర్గంలో ఇతర ప్రాంతాల వారు నివసించరాదని తెలిపారు.

election campaigning for tirupati by poles ended
ముగిసిన ఉపఎన్నిక ప్రచారం.. 144 సెక్షన్ అమలు

By

Published : Apr 15, 2021, 9:16 PM IST

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ప్రచార గడువు ముగిసిన కారణంగా.. 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణాటాటా తో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజక వర్గాల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 7 లక్షల 40 వేల ఓటర్ల కోసం 1056 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.

గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంటారని కలెక్టర్​ తెలిపారు. తిరుపతిలో స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు మినహా స్థానికేతరులు లాడ్జ్​ల్లో, అతిథి గృహాల్లో నివసించరాదని ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 377 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్న అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణా టాటా.. అక్కడ సెంట్రల్ ఆర్మడ్​ఫోర్స్, వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్స్​తో నిఘా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. రాత్రి 7 తర్వాత స్థానిక ఓటర్లు కాని వారు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉండరాదని ఇప్పటికే ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details