కోడి గుడ్డులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. ఈ సమయంలో గుడ్లు ఎక్కువగా తినటం మంచిదని కోళ్ల సమాఖ్య అధ్యక్షుడు సుందరనాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు కోడిగుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. గుడ్డు తింటే విటమిన్ డి, బీ12 విటమిన్లు పుష్కలంగా లభిస్తాయని పేర్కొన్నారు. రోగ నిరోధక శక్తి పెంపొందుతుందన్నారు.
చంద్రగిరి ప్రజలకు ఉచితంగా కోడిగుడ్లు పంపిణీ - #corona list inAP
చిత్తూరుకు చెందిన కోళ్ల పెంపకందారుల ద్వారా సేకరించిన 16 లక్షల కోడిగుడ్లను చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు అందించే కార్యక్రమాన్ని స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో కోళ్ల సమాఖ్య అధ్యక్షుడు సుందరనాయుడు ప్రారంభించారు.
![చంద్రగిరి ప్రజలకు ఉచితంగా కోడిగుడ్లు పంపిణీ eggs distribute to people in chnadragiri at chittoor dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6742995-627-6742995-1586531597519.jpg)
చంద్రగిరి ప్రజలకు ఉచితంగా కోడిగుడ్ల పంపిణీ