యువతను ఉరకలెత్తించే ఈనాడు స్పోర్ట్స్ లీగ్ క్రీడా పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటిరోజు బాలబాలికలకు అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చదరంగం పోటీలను జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించారు. పోటీలో పలు కళాశాలకు చెందిన బాలబాలికల క్రీడాకారులు హోరాహోరీగా బరిలో తలపడ్డారు .
గెలుపొందిన వారు
చదరంగం బాలుర విభాగంలో తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలకు చెందిన విష్ణువర్ధన్ విన్నర్‌గా, తరుణ్ రెడ్డి రన్నర్‌గా గెలుపొందారు. బాలికల విభాగంలో మదనపల్లె శ్రీ కృష్ణారెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాలకు చెందిన భానుశ్రీ గెలుపొందగా, తిరుపతి ఎస్పీ డబ్ల్యు కళాశాలకు చెందిన లక్ష్మీకుసుమ దేవి రెండో స్థానంలో నిలిచారు. అదే విధంగా అథ్లెటిక్స్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో ఎస్వి జూనియర్ కళాశాల, ఎస్వి డిఫెన్స్ అకాడమీకి చెందిన బాల బాలికల కళాకారులు విజయం సాధించారు.
తిరుపతిలో ఈనాడు క్రీడా పోటీలకు విశేష స్పందన - తిరుపతిలో ఈనాడు క్రీడా పోటీలకు విశేష స్పందన
తిరుపతిలో ప్రారంభమైన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ క్రీడా పోటీల్లో బాలబాలికలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలి రోజు అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చదరంగం పోటీల్లో పలు కళాశాలల నుంచి పాల్గొన క్రీడాకారులు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు.
![తిరుపతిలో ఈనాడు క్రీడా పోటీలకు విశేష స్పందన తిరుపతిలో ఈనాడు క్రీడా పోటీలకు విశేష స్పందన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5573808-1004-5573808-1578048586933.jpg)
తిరుపతిలో ఈనాడు క్రీడా పోటీలకు విశేష స్పందన
తిరుపతిలో ఈనాడు క్రీడా పోటీలకు విశేష స్పందన
ఇదీ చదవండి :