తిరుపతిలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తుమ్మలగుంటలోని వైఎస్ఆర్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న పోటీలను ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథ రావు, సిద్ధార్థ కళాశాలల ఛైర్మన్ అశోక రాజు హాజరయ్యారు. వైఎస్ఆర్ క్రీడా మైదానం- 1, 2, 3లు వేదికగా జూనియర్, సీనియర్ విభాగాల్లో జిల్లా నుంచి మొత్తం 72 జట్లు పోటీ పడుతున్నాయి. యువ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు ఏటా క్రమం తప్పకుండా ఈనాడు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ లీగ్.. క్రీడా స్ఫూర్తి పంచుతోందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొనియాడారు.
తిరుపతిలో ఉల్లాసంగా.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 - తిరుపతిలో ఉల్లాసంగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 క్రీడా పోటీలు
ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 పోటీలు తిరుపతిలో ప్రారంభమయ్యాయి. తుమ్మలగుంటలోని వైఎస్ఆర్ క్రీడా మైదానంలోని మూడు మైదానాలు వేదికగా మారాయి.

తిరుపతిలో ఉల్లాసంగా.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 క్రీడా పోటీలు
తిరుపతిలో ఉల్లాసంగా.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019