చిత్తూరు జిల్లా తిరుపతి తుమ్మలగుంట వైఎస్సార్ క్రీడా ప్రాంగణం వేదికగా 10 రోజులుగా జరిగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ పోటీలు ముగిశాయి. పోటీల్లో మెుత్తం 74 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్ బాలికల విభాగంలో కృష్ణతేజ కళాశాల, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ జట్లు తలపడ్డాయి. చిత్తూరు క్రికెట్ అసోసియేషన్ జట్టు విజయం సాధించింది. బాలుర జూనియర్స్ విభాగంలో ఎస్వీ జూనియర్ కళాశాల, ఎమరాల్డ్స్ జూనియర్ కళాశాల పోటీపడగా... ఎస్వీ జూనియర్ కళాశాల జట్టు గెలుపొందింది.
చిత్తూరులో ముగిసిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 - eenadu cricket league tirupathi news
చిత్తూరు జిల్లాలో 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు ముగిశాయి. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
చిత్తూరులో ముగిసిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019
బాలుర సీనియర్స్ విభాగంలో ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాల, మదనపల్లి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ పోటీపడ్డాయి. ఎమరాల్డ్స్ జట్టు విజయకేతనం ఎగరేసింది. పుత్తూరు సిద్దార్థ విద్యాసంస్థల ఛైర్మన్ అశోకరాజు క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను నిరూపించుకోవడానికి 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ చక్కని వేదికని ప్రశంసించారు.
ఇదీ చదవండి: తిరుపతిలో 'మానవ వికాస వేదిక' భారీ ర్యాలీ