ఇదో మారుమూల మండలం. చిత్తూరు జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం. అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోని పెద్దమండ్యం మండలంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి ఫలితాలు సాధిస్తున్నాయి. ఇక్కడి మోడల్ పాఠశాలలో చేరడానికి విద్యార్థులు పోటీ పడుతున్నారిప్పుడు. ప్రతి సంవత్సరం పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు ఆదర్శవంతంగా ఉండడమే ఈ పాఠశాల లో సీటు సాధించడానికి పోటీ నెలకొంది.
మారుమూల పల్లె బడి... సృష్టిస్తోంది నూతన ఒరవడి - education
మూరుమూల పల్లె బడి అది. అయితేనేం కార్పొరేట్ స్థాయి ఫలితాలు సాధిస్తోంది. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడా పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు.
గత విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో ఈ పాఠశాల 100శాతం సాధించింది. పదికి పది గ్రేడులో ఇద్దరు విద్యార్థులు, 9.8 నలుగురు విద్యార్థులు, 9.7 ముగ్గురు విద్యార్థులు, తొమ్మికిదిపైన గ్రేడులో 30 మంది విద్యార్థులు నిలిచారు. 2018 - 19 విద్యా సంవత్సరంలో సైన్స్ ఫేర్‌లో రాష్ట్ర స్థాయిలో 2అవార్డులు సాధించారు. ఆరోగ్యవంతమైన ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు, పరిసరాలు పచ్చదనం, చెట్ల పెంపకం, క్రమశిక్షణలో ఈ పాఠశాల విద్యార్థులు ఆదర్శప్రాయులు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక తరగతుల నిర్వహణ కారణంతో ఈ పాఠశాలలో 100శాతం ఫలితాలు సాధిస్తున్నారు.