చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తుమ్మవారిపల్లిలో గత రెండు రోజులుగా భూ ప్రకంపనలు వస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోవడంతో మండల స్థాయి అధికారులు గ్రామంలోకి వెళ్లి పరిశీలించారు. భూమి నుంచి శబ్దాలు వస్తుండటాన్ని గుర్తించారు. గ్రామం చుట్టు పక్కల ఎక్కవగా బోర్లు వేయడంతో శబ్దాలు వస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు.
తుమ్మలవారిపల్లిలో భూ ప్రకంపనలు.. ఆందోళనలో ప్రజలు - చిత్తూరు జిల్లా వార్తలు
గత రెండు రోజులుగా చిత్తూరు జిల్లా తుమ్మవారిపల్లిలో భూప్రకంపనలు వస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చుట్టుపక్కల ఎక్కువగా బోర్లు వేయడం వల్లే శబ్ధాలు వస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు.

తుమ్మలవారిపల్లిలో భూ ప్రకంపనలు