Earthquake fear at chittoor: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కౌండిన్య అభయారణ్యం సరిహద్దులోని తిమ్మయ్యగారిపల్లె, నల్లగుట్లపల్లె, ఓటేరుపాళ్యం, రఘునాయకులదిన్నె గ్రామాల్లో రెండు రోజులుగా భూప్రకంపనలతో వస్తున్న భారీ శబ్దాలకు జనం హడలిపోతున్నారు. ఇళ్లు కూలిపోతాయేమోననే భయంతో వీధుల్లోకి పరుగులుతీశారు.
తిమ్మయ్యగారిపల్లెలో స్థానికులు ఊరికి సమీపంలోని బండపైకి చేరుకుని టార్పాలిన్ పట్టలతో గుడారాలు వేసుకున్నారు. బుధవారమూ భూప్రకంపనలు కొనసాగడంతో తహసీల్దార్ సీతారాం, ఎంపీడీవో రాజేంద్రబాలాజీ, ఎస్సై మునిస్వామి గ్రామాల్లో పర్యటించారు. భూమి పొరల్లోకి నీరు చేరడంతో శబ్దాలు వచ్చి ఉండవచ్చని తెలిపారు.