చెత్త నిల్వల కోసం కేటాయించిన డంపింగ్ యార్డు స్థలాన్ని అక్రమార్కులు వదలిపెట్టడం లేదు. అవకాశాలను అనుకూలంగా చేసుకుని ఆక్రమించేందుకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి శివారు ప్రాంతం, తొట్టంబేడు గ్రామానికి వెళ్లే మార్గంలో ఇది వరకు పురపాలక సంఘానికి సంబంధించి డంపింగ్ యార్డుగా ఉంటూ వచ్చింది. అప్పట్లో తొట్టంబేడు పంచాయతీ ఆమోదంతో సర్వే నంబరు 28/34 సర్వే నంబరులో రెండు ఎకరాల స్థలాన్ని పంచాయతీ నుంచి తీసుకున్నారు. ఇప్పటికీ పురపాలక సంఘ అనుభవంలోనే ఉంది. కొన్నాళ్ల పాటు ఇక్కడే చెత్త నిల్వలు చేసే్తూ డంపింగ్ యార్డుగా వాడుకుంటూ వచ్చారు. పట్టణ పరిధి పెరగడం, శివారు ప్రాంతాల్లో కాలనీలు ఏర్పాటు కావడంతో నివాస గృహాల మధ్య డంపింగ్ యార్డు ఉండకూడదన్న ఆలోచనతో చెత్త నిల్వలు చేయడం లేదు. ప్రత్యామ్నాయంగా తొట్టంబేడు తిప్పలకు చెందిన ప్రాంతంలో ప్రస్తుతం చెత్తను వేసే్తున్నారు. ఇది వరకు డంపింగ్ యార్డు కొనసాగుతున్న స్థలం పట్టణానికి సమీపంలో, చెన్నై రోడ్డును ఆనుకుని ఉండటంతో ఇక్కడి స్థలానికి విలువ పెరిగింది. ఇక్కడి భూమి నిరుపయోగంగా ఉండటం, ప్రాధాన్యత ఎక్కువ కావడంతో అక్రమార్కుల కన్నుపడింది. మార్కెట్ ధరలతో పోలిస్తే ఇక్కడి స్థలం దాదాపు రూ.కోటి వరకు పలుకుతోంది.
‘దస్త్రం’.. అధికారులకు గండం