ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో డ్రైవింగ్... ఆ తరువాత.. - drunk and driving in chittoor dst

మద్యం మత్తులో ద్విచక్రవాహనాన్ని అదుపుచేయలేక బోల్తాపడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం తొట్టికండిగ ఎస్టీ కాలనీ వద్ద ఈ సంఘటన జరిగింది.

due to drunk and driving driver fall in drinage at chittoor dst
due to drunk and driving driver fall in drinage at chittoor dst

By

Published : May 8, 2020, 9:25 PM IST

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం నేతాజీ కాలనీకి చెందిన శివకుమార్ (39) పాలసముద్రం మండలంలో చనిపోయిన తన సమీప బంధువు అంత్యక్రియలకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. అంత్యక్రియల సందర్భంగా మద్యం సేవించిన శివకుమార్... స్వస్థలానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. పాల సముద్రం మండలం తొట్టి కండిగ ఎస్టీ కాలనీ వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పింది. ప్రధాన రహదారి పక్కన పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న శివకుమార్ తలకు, కాళ్లకు గాయాలు అయ్యాయి. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... క్షతగాత్రుడిని వైద్యం కోసం తరలించారు.

ABOUT THE AUTHOR

...view details