ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెదురుకుప్పం ఘటనపై విచారణ జరుపుతున్నాం: డీఎస్పీ - చిత్తూరు జిల్లా వెదురుకుప్పం తాజా వార్తలు

పోలీసులు దళితులపై దాడి చేశారనే ఆరోపణలపై పుత్తూరు డీఎస్పీ మురళీధర్ స్పందించారు. గ్రామంలో బాల్యవివాహం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు గ్రామానికి వెళ్లారని వివరించారు. ఎస్సై నిజంగానే దాడి చేశారో.. లేదో.. విచారణ చేస్తున్నామని అన్నారు.

dsp on vedhurukuppam
dsp on vedhurukuppam

By

Published : Oct 31, 2020, 5:35 PM IST

చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో దళితుడిపై పోలీసులు దాడి చేశారనే ఆరోపణలపై.. పుత్తూరు డీఎస్పీ మురళీధర్ స్పందించారు. యనమల మంద గ్రామంలో బాల్య వివాహం చేయబోతున్నట్లు ఐసీడీఎస్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.

విచారణ కోసం పోలీసులకు గ్రామానికి వెళ్లారన్న డీఎస్పీ.. గ్రామంలో వరుడు, వధువుకి బంధువైన బాబు అనే వ్యక్తిని ఎస్ఐ లోకేశ్​రెడ్డి విచారించారన్నారు. దీంతో పోలీసులు కొట్టారంటూ.. గ్రామానికి చెందిన ఇరువర్గాల ప్రజలు వెదురుకుప్పం పోలీస్ స్టేషన్​ను ముట్టడించారని డీఎస్పీ వివరించారు. స్టేషన్​లో ఫర్నిచర్ ధ్వంసం చేసి దస్త్రాలను గ్రామస్తులు చెల్లాచెదురు చేశారన్నారు. ఎస్సై నిజంగానే దాడి చేశారో.. లేదో.. విచారణ చేస్తున్నామని వివరించారు. గ్రామంలో బాల్య వివాహం జరిగిన ఘటనపైన కూడా విచారణ చేస్తున్నామన్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఇదీ చదవండి:పారిస్​లో 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్​

ABOUT THE AUTHOR

...view details